Wednesday, October 29, 2008

సిజేరియన్ కి ముహూర్తం పెట్టబడును

ఏంటో ఈ మద్య సిజేరియన్ కి కూడా ముహూర్తాలు పెడుతున్నారు, కరక్టుగా ఈ నిముషానికి చెయాలని. అయినా "విధి కి తిది అడ్డమా" అన్నట్టు జన్మ నక్షత్రాన్ని కూడా ఎడిట్ చేసుకుంటే జాతకం మారుతుందా వీళ్ళ పిచ్చికాని.

మొన్న మద్య టి.వి లో చూసా ఒక ప్రకటన ఈ సిజేరియన్ ముహూర్తం ఎక్స్పర్టు, వెయ్యి రూపాయలు ఫీజు అట. ఇక హాస్పిటల్ వాళ్ళు కూడా ఒక పంతులును కన్సల్టంట్ గా పెట్టు కోవలసి వస్తుందేమో.

3 comments:

వర్మ said...

ఇది నాకు కూడా నచ్చని విషయం. జాతకం బాగుంటే వారి తలరాత మారుతుందనుకోవటం .... ????

సుజాత వేల్పూరి said...

మా పరిచయస్తులొకరు ఎలాగూ సిజేరియనే కదాని, పాప ఏ నిమిషంలో పుట్టాలో డాక్టరు కి చెప్పి, పాప జాతకం రాయించి (ఇది టూ మచ్ కదా) అప్పుడు వెళ్ళారు ఆపరేషన్ కి! ఇది నిజంగా జరిగింది. పాప డల్లాస్ లో పుట్టింది. పిచ్చి ముదిరింది...రోకలి..అంటే ఇదే!

శ్రీనివాస్ పప్పు said...

అసలు బిడ్డ పుట్టుక అనే దాన్ని ఎలాగ కనిపెడతారు..అండం పిండం గా మారే సమయాన్ని లెక్కలోకి తీసుకోగలిగితే దాన్ని పుట్టుకగా నిర్ణయిస్తే అప్పుడు సరి అయిన సమయంగా పరిగణించవచ్చు కదా...అప్పుడు ఈ పైన చెప్పిన వగైరాలన్నీ ఉత్తుత్తివేనా..ఎవరయినా ఏకీభవిస్తారా...పొరపాటైతే సెమిన్సెయండి...