Thursday, October 30, 2008

ఆటో వాలా - బాడీ సైకాలజీ

హైదరాబాదు ఆటో లో ప్రయాణించే బ్లాగు స్నేహితులకి చిట్కాలు.
ముందు ఆటో వాలా బాడీ సైకాలజీ గురించి తెలుసు కుందాము.
ఆటో వాలా (16-25 వయసు)
ఆటో ఎక్ష్త్రా డబ్బులు ఇవ్వాలి, కానీ ఎఫ్.ఎం రేడియో లేదా కొత్త పాటలు ఫ్రీగా వినవచ్చు. కళ్లు మూసి తెరిచే లోపు చేరుకోవచ్చు.

ఆటో వాలా (25-35 వయసు)
అతను ఎక్కడకు వెళ్ళాలనుకుంటాడో అక్కడకు మాత్రమే వస్తాడు, నెక్స్ట్ స్టాపు అయిన రాడు, సో మీ ఇల్లు అతని ఇంటి పక్కనో, వాళ్ల మామ ఇంటి పక్కనో ఉండేటట్టు చూసుకోండి.

ఆటో వాలా (35-45 వయసు)
వీరి ఆటో లో మీరు ఎక్కాలంటే మీకు కొంచం కరంట్ ఎఫయైర్ మీకు తెలిసి ఉండాలి, లేదా రోజు ఆపీసులో పేపర్లు తిరగవేయాలి, ఎందుకంటే వీరు మీరు ఆటో ఎక్కిన కొద్ది సేపటికి ఏదో ఒక విషయం మీద చర్చ లేవ దీస్తారు. మీరు కూడా కొంచం వంత పాడారు అనుకోండి, మీకు ఇంటిదాకా ఆటో లో ఎక్ష్త్రా గొనక్కుండా వస్తారు.

ఆటో వాలా (45-55 వయసు)

వీరి ఆటో సేఫ్ మనకు, కాని సినమా కి ౧౦ నిమిషాలు ఉందనగా ఎక్కకు అనుకోండి మినిమం ఇంటెర్వల్ కి చేరుకుంటారు. స్లోగా, స్పీడు బ్రేకర్లకు దెబ్బ తగలకుండా వెళ్తారు అన్నమాట.

ఎలాంటి ఆటో ఎక్కాలి .
ఆటోని మీరు పంజాగుట్ట కి వస్తావా అని అడిగారు, పంజాగుట్ట లో ఎక్కడ అని అడిగాడు అనుకోండి, సో మీటరు వేయడు అని అర్థం .

ఆటోవాలా స్లోగా రోడ్డు ఒక పక్కకు వస్తూ మీ వైపుకు వస్తూ ఉంటే పర్లేదు, మీరు ఎక్కడకు రమ్మనా వస్తాడు. ఎందుకంటే అది డెస్పరేట్ శిచివేషన్ అన్నమాట.

మీటరుకు షర్టు చుట్టాదనుకోండి ఇంక మనవాడి ఇష్టం వాట్, టాక్స్ అన్నే మీ మెడ వేస్తాడు అని అర్థం.

ఎలా వెళ్దాం అని అంటే మీ ఇష్టం అంటే, ఇక మీకు ameerpet to Punjagutta పంజాగుట్ట వయా kukatpalli గతి, సో ఎలా వెళ్దాం అంటే లెఫ్ట్ లో అని చెప్పండి. ఎందుకంటే హైదరాబాదు లో చాలామటుకు ఫ్రీ లెఫ్తులు ఉంటాయి.

చివరగా
ఆటో ఎక్కడం మాత్రమే నీవు చెయ్, మీటరు ఆ ఆటోవాలా కి వదిలేయ్.
మీటరు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య
మీటరు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము.

Wednesday, October 29, 2008

సిజేరియన్ కి ముహూర్తం పెట్టబడును

ఏంటో ఈ మద్య సిజేరియన్ కి కూడా ముహూర్తాలు పెడుతున్నారు, కరక్టుగా ఈ నిముషానికి చెయాలని. అయినా "విధి కి తిది అడ్డమా" అన్నట్టు జన్మ నక్షత్రాన్ని కూడా ఎడిట్ చేసుకుంటే జాతకం మారుతుందా వీళ్ళ పిచ్చికాని.

మొన్న మద్య టి.వి లో చూసా ఒక ప్రకటన ఈ సిజేరియన్ ముహూర్తం ఎక్స్పర్టు, వెయ్యి రూపాయలు ఫీజు అట. ఇక హాస్పిటల్ వాళ్ళు కూడా ఒక పంతులును కన్సల్టంట్ గా పెట్టు కోవలసి వస్తుందేమో.

Sunday, August 31, 2008

నా షిరిడి యాత్ర

ఈ సారి నేను షిరిడి వర్షం తో కలసి వెళ్ళడం జరిగింది, ఆంధ్ర టూరిజం వారి బస్సులో.

నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఒక బాబా మందిరం తప్ప మిగతా అన్నీ దారులూ మట్టి దారులే (రెండు మూడు దారులు తప్ప). వర్షం లో దారులు అన్నీ బురదమయం. పాపం షిరిడి సంస్థానం వారు ఏమి చేస్తారు. బాబాకు మనం ఎన్ని సంవత్సరాలు గడిచినా డాలర్ విలువ రూపాయి విలువ ఎంత పెరిగినా మనం బాబా కి ఇచ్చేది, బాబా గారు అడిగేది రెండు రూపాయలే.

నేను సాఫ్టువేరు జాబు మానేస్తున్నా- II

నేను ఈ సాఫ్టువేరు జాబు మాని ఒక డిజిటల్ ప్రింట్ కంపని పెడదామనుకుంటున్నా. ఎందుకంటారా?

1,ఎలాగు వినాయక చవితి వస్తున్నది కదా బ్యానర్లు కావాలా
2,ప్రజారాజ్యం లో చేరేకి బ్యానర్లు పెట్టాలా
3,పుట్టినరోజులు ఎలాగూ వస్తూ వుంటాయి కదా
4,ఈ మద్య తద్దినాలకు కూడా బ్యానర్లు పెడుతున్నారు కదా.

ఇంతకంటే కారణం ఏమికావాలి నేను సాఫ్టువేరు జాబు మానివేయటానికి, పుట్టిన రోజు నుంచి చచ్చేరోజు వరకు మన వెంట వుండేది ఏమిటనుకున్నారు? నాకు తెలుసు మీరు పుణ్యం అంటారు అని, అక్కడే మీరు మూతలేని మ్యాన్ హోల్ లో కాలు పెట్టారు. పుట్టిన రోజు నుంచి చచ్చేరోజు వరకు మన వెంట వుండేది బ్యానర్లు మాత్రామే. పుట్టిన రోజు శుబాకాంక్షలు నుంచి చచ్చే సంతాపాల వరకు మనిషికి తోడు బ్యానర్లే.

Monday, August 18, 2008

తెలుగు వారు లేని

తెలుగు వారు లేని జైహింద్ విడియో, నాకు చివరలో తెలుగు జైహింద్ అన్నా పదం తప ఎక్కడ తెలుగు వారు కనపడలేదు ఈ వీడియో లో... మన బాలు గారు కోసం చూసా నేను . మీరు చూసి చెప్పండి

Sunday, August 17, 2008

చిరంజీవి పార్తీ- మీడియా హడావిడి

ఊపేకూహా, ఎంకి పెళ్ళి ఎవరో చావుకొచ్హింది అనె సామెతలు ఇక్కడ బాగా సరిపొతాయేమో.

మైకుల గోల, కేమెరా ఫ్లాషుల మోత వెరసి ఇదే చిరంజీవి పార్టీ ప్రకటన సమావేశం విశేషాలు.ఛిరంజీవి కూడ కొంచం మాటలకోసం తడబడ్డారు.

చివరికి చిరంజీవి గారు తమ పార్టీ గుర్తు and పేరు ఇప్పుడు చెప్పను అని తేల్చేసారు, హమయ్య చెప్పేసి వుంటే ఎమైనా వుందా ఇంకా మీడియా లో వార్తలకు ఊహాగానాలకు తెర పడి వుండేదే. ఎంత నష్టం మీడియా కి.

ఈ మద్య కాలంలొ ఒక వ్రుత్తి నిపుణులు బాగా పని చెస్తునాఅరూ అంటే అది మీడియానే. అసలు చిరంజీవి సమవేశంలొ మాట్లాదనిస్తెగా, సమావేసం ముగిసి చిరంజీవి వెళ్ళరు అనెదానికన్నా, చిరంజీవిని భయపెట్టి పంపేసారు అంటే సరిపొతుందేమో.

Tuesday, June 10, 2008

నేను సాఫ్టువేరు జాబు మానేస్తున్నా

నేను ఈ సాఫ్టువేరు జాబు మాని ఒక కాలేజి పెడదామనుకుంటున్నా.

మా కాలేజి ప్రత్యేకతలు
1, LKG నుంచి IIIT.
2, తల్లితండ్రులకి 100% లోను సౌకర్యం.
3, మీ పిల్లవాడికి ర్యాంక్ వస్తే ఒక అందమైన కోటు.
4, ఆ కోటు తొ మీ పిల్లవాడి ఫొటో పేపర్లో వేయించెదము.
5, పుట్టబోయే అబ్బాయికి/అమ్మాయికి ఇప్పుడే రిజర్వు చెసుకుంటే మీకు ఒక రుబ్బురోలు ఉచితం.

ఇంక వివరాలకు పేపర్లో కింగుసైజు మా ప్రకటనను, టి.వి లొ మా ఆర్తనాద ప్రకటనను చూడగలరు.