నేను ఈ సాఫ్టువేరు జాబు మాని ఒక డిజిటల్ ప్రింట్ కంపని పెడదామనుకుంటున్నా. ఎందుకంటారా?
1,ఎలాగు వినాయక చవితి వస్తున్నది కదా బ్యానర్లు కావాలా
2,ప్రజారాజ్యం లో చేరేకి బ్యానర్లు పెట్టాలా
3,పుట్టినరోజులు ఎలాగూ వస్తూ వుంటాయి కదా
4,ఈ మద్య తద్దినాలకు కూడా బ్యానర్లు పెడుతున్నారు కదా.
ఇంతకంటే కారణం ఏమికావాలి నేను సాఫ్టువేరు జాబు మానివేయటానికి, పుట్టిన రోజు నుంచి చచ్చేరోజు వరకు మన వెంట వుండేది ఏమిటనుకున్నారు? నాకు తెలుసు మీరు పుణ్యం అంటారు అని, అక్కడే మీరు మూతలేని మ్యాన్ హోల్ లో కాలు పెట్టారు. పుట్టిన రోజు నుంచి చచ్చేరోజు వరకు మన వెంట వుండేది బ్యానర్లు మాత్రామే. పుట్టిన రోజు శుబాకాంక్షలు నుంచి చచ్చే సంతాపాల వరకు మనిషికి తోడు బ్యానర్లే.
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
బాగా చెప్పారు సుమండీ! అయ్యప్ప స్వామి పూజలకు, పెళ్ళిళ్ళకు(వధూవరులు, వారి తల్లి దండ్రులు ఫొటోలతో),ఎవరో పార్టీ పెడితే ఆయన అభిమానులు ఇదే సందని మాంచి కత్తి లాంటి ఫోటోలతో సహా బానర్లు వేయించుకోవడం ఏమిటో అర్థం కావట్లేదు.శుభం! మీరు నెలకు నాలుగు EMIలైనా కట్టేంత సంపాదిస్తారు పొండి!
:-))
సుజాత గారు, థాంక్స్. మీరు కూడా బ్యానర్ మా దగ్గరే ప్రింట్ చేయించుకోవాలి
బ్యానర్లంటే?
త్వరలో నేను ఒక పార్టీలో చేరబోతున్నా మరి పొలిటికల్ కన్సెషన్ ఏమైనా ఉందా ????
Post a Comment