Thursday, October 30, 2008

ఆటో వాలా - బాడీ సైకాలజీ

హైదరాబాదు ఆటో లో ప్రయాణించే బ్లాగు స్నేహితులకి చిట్కాలు.
ముందు ఆటో వాలా బాడీ సైకాలజీ గురించి తెలుసు కుందాము.
ఆటో వాలా (16-25 వయసు)
ఆటో ఎక్ష్త్రా డబ్బులు ఇవ్వాలి, కానీ ఎఫ్.ఎం రేడియో లేదా కొత్త పాటలు ఫ్రీగా వినవచ్చు. కళ్లు మూసి తెరిచే లోపు చేరుకోవచ్చు.

ఆటో వాలా (25-35 వయసు)
అతను ఎక్కడకు వెళ్ళాలనుకుంటాడో అక్కడకు మాత్రమే వస్తాడు, నెక్స్ట్ స్టాపు అయిన రాడు, సో మీ ఇల్లు అతని ఇంటి పక్కనో, వాళ్ల మామ ఇంటి పక్కనో ఉండేటట్టు చూసుకోండి.

ఆటో వాలా (35-45 వయసు)
వీరి ఆటో లో మీరు ఎక్కాలంటే మీకు కొంచం కరంట్ ఎఫయైర్ మీకు తెలిసి ఉండాలి, లేదా రోజు ఆపీసులో పేపర్లు తిరగవేయాలి, ఎందుకంటే వీరు మీరు ఆటో ఎక్కిన కొద్ది సేపటికి ఏదో ఒక విషయం మీద చర్చ లేవ దీస్తారు. మీరు కూడా కొంచం వంత పాడారు అనుకోండి, మీకు ఇంటిదాకా ఆటో లో ఎక్ష్త్రా గొనక్కుండా వస్తారు.

ఆటో వాలా (45-55 వయసు)

వీరి ఆటో సేఫ్ మనకు, కాని సినమా కి ౧౦ నిమిషాలు ఉందనగా ఎక్కకు అనుకోండి మినిమం ఇంటెర్వల్ కి చేరుకుంటారు. స్లోగా, స్పీడు బ్రేకర్లకు దెబ్బ తగలకుండా వెళ్తారు అన్నమాట.

ఎలాంటి ఆటో ఎక్కాలి .
ఆటోని మీరు పంజాగుట్ట కి వస్తావా అని అడిగారు, పంజాగుట్ట లో ఎక్కడ అని అడిగాడు అనుకోండి, సో మీటరు వేయడు అని అర్థం .

ఆటోవాలా స్లోగా రోడ్డు ఒక పక్కకు వస్తూ మీ వైపుకు వస్తూ ఉంటే పర్లేదు, మీరు ఎక్కడకు రమ్మనా వస్తాడు. ఎందుకంటే అది డెస్పరేట్ శిచివేషన్ అన్నమాట.

మీటరుకు షర్టు చుట్టాదనుకోండి ఇంక మనవాడి ఇష్టం వాట్, టాక్స్ అన్నే మీ మెడ వేస్తాడు అని అర్థం.

ఎలా వెళ్దాం అని అంటే మీ ఇష్టం అంటే, ఇక మీకు ameerpet to Punjagutta పంజాగుట్ట వయా kukatpalli గతి, సో ఎలా వెళ్దాం అంటే లెఫ్ట్ లో అని చెప్పండి. ఎందుకంటే హైదరాబాదు లో చాలామటుకు ఫ్రీ లెఫ్తులు ఉంటాయి.

చివరగా
ఆటో ఎక్కడం మాత్రమే నీవు చెయ్, మీటరు ఆ ఆటోవాలా కి వదిలేయ్.
మీటరు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య
మీటరు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము.

12 comments:

Purnima said...

ఉన్నపలాన మీకు "హైద్ ఆటో" సబ్జెక్ట్ లో పి.హెచ్‍డి ఇచ్చేస్తున్నానోచ్!

Nice observations! Bingo!

రిషి said...

haha :)

రాధిక said...

ఒప్పేసుకుంటున్నానండి మీకు అరడజను ఆటోలున్నాయని :)
ఇరగదీసారు సార్

Unknown said...

కేకాస్పదం.. "స్పీడు బ్రేకర్లకు దెబ్బ తగలకుండా వెళ్తారు" బాగుంది..

వర్మ said...

మీ విశ్లేషణ బాగుంది ..

Shankar Reddy said...

బాగుంది ..

లక్ష్మి said...

vaa.... nenu rayali anukunnaa meeru rasesaaru...anyways kudos :)

VJ said...

@పూర్ణిమ గారు,
నా పి.హెచ్‍డి పట్టాకి మీరె సాక్షి సంతకం పెట్టాలి.

@రిషి, వర్మ, శంకర్ గార్లకు,
నెస్సర్లు

@రాధిక గారు,
మీరు భలే కనుక్కున్నారు :)

@సత్యప్రసాద్ గారు,
మీరే ఇన్స్పిరేషన్

@లక్ష్మి గారు,
మీరు ఇలాంటి బ్లాగు రాస్తూ ఉనప్పుడు మీ వెనక కిటికీ ఎక్కి చూసానోచ్, అందుకే మీ కన్నా ముందే రాసేసా, ఈసారి కిటికీ వేసుకో మనవి.

చైతన్య.ఎస్ said...

బాగుంది మీ analysis. bangalore ఆటోవాలా ల సైకాలజీ కూడా ఇంతే.

kusha said...

time unnappudu blore,chennai vaalla gurunchi kooda raaste baaguntundi...:-)

kiraN said...

చాలా బాగుంది..
హైదరాబాదీ ఆటో వాలాల గురించి రీసర్చ్ చేసినట్టుగా ఉంది.

- కిరణ్
ఐతే OK

Unknown said...

Good Piece of Information Telugu Blogs Baaga ne Maintain Chestunnaru Keep it Up

Teluguwap,Telugu4u

Tollywood,Tollywood Updates , Movie Reviews